హైదరాబాదులో వేలాది రోహింగ్యాలు.. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి వివరాల సేకరణ!

  • మూడు కమిషరేట్ల పరిధిలో 6,040 రోహింగ్యాలు
  • రాచకొండ పరిధిలోనే 5 వేల మంది
  • కుటుంబసభ్యుల వివరాలు కూడా  సేకరణ
హైదరాబాదు పరిధిలోని రోహింగ్యా ముస్లింల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 6,040 మంది రోహింగ్యాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 5 వేల మంది రోహింగ్యాలు వున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెయ్యి మంది రోహింగ్యాలను పోలీసులు గుర్తించారు.

ఢిల్లీలోని మర్కజ్ యాత్రకు వీరిలో ఎవరైనా వెళ్లారా? వెళ్లిన వారు తిరిగొచ్చారా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన రోహింగ్యాల కుటుంబసభ్యుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.

Rohingyas
Hyderabad
Delhi

More Telugu News